టాలీవుడ్ హీరో నాగార్జున కెరీర్‌లోని ది బెస్ట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ షేక్ చేసింది. 1989 మే 12న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టింది. అప్పట్లో యూత్ ను కట్టిపడేసిన మూవీ ఇది. అప్పట్లో అందమైన ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా ఓ సంచలనమే. ఇక ఇందులో నాగార్జున యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అటు కంటెంట్.. ఇటు ఈ మూవీలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇళయరాజా అందించిన మ్యూజిక్ శ్రోతలను మెస్మరైజ్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో గీతాంజలి సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో నాగ్ జోడిగా గిరిజ నటించింది.
ప్రాణాల కోసం పోరాడుతున్న ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడడం.. ఆ తర్వాత వారిద్దరికి ఉన్న సమస్య గురించి తెలియడంతో ఇద్దరి జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయనే భిన్నమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు మణిరత్నం. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్ లవ్ స్టోరీ.. అయినప్పటికీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. దాదాపు 100 రోజులకు పైగా థియేటర్లలో ఆడిన ఈ సినిమాను కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేశారట. ఈ సినిమాలో గిరిజ, నాగ్ కెమిస్ట్రీ, నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ చిత్రం ఏకంగా ఆరు నంది అవార్డులు అందుకుంది.
1988లో వచ్చిన ఈ సినిమాను దాదాపు రూ.1.2 కోట్ల బడ్జెట్ తో నిర్మంచారట. ఇక ఈ సినిమాలో నటించిన హీరో కంటే దర్శకుడికి అధిక పారితోషికం ఇవ్వడం విశేషం. ఈ సినిమాకు నాగార్జునకు రూ.7.5 లక్షలు రెమ్యునరేషన్ ఇవ్వగా.. డైరెక్టర్ మణిరత్నంకు రూ.10 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అప్పటికే తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను రూపొందించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ మణిరత్నం. అలాగే నాగార్జున సైతం విభిన్న కంటెంట్ చిత్రాలతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ గీతాంజలి సినిమాతో యూత్ లో నాగ్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..
Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..
OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‌స్టాప్ సస్పెన్స్..
Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..