ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. జనసేన తరపున మంత్రి వర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. కానీ ఆయనకు కేటాయించే శాఖల పై క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు. త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం నాగబాబు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆయనకు మంత్రి పదవి కేటాయించే శాఖల పై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవాల్సి ఉండగా.. ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో.. పొత్తులో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ క్యాబినెట్ లోకి నాగబాబు రానున్నారు. త్వరలోనే నాగబాబుకు మంత్రి పదవిని ప్రకటించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.