NEET UG 2025 Exam Date: మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు

NEET UG 2025 Exam Date: మరోవారంలో నీట్‌ యూజీ 2025 పరీక్ష.. 4 రోజుల ముందుగా అడ్మిట్‌ కార్డులు


హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రవేశ పరీక్ష మరో వారం రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను విడుదల చేసింది.

పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నీట్‌ యూజీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ నమోదు చేసి పరీక్ష కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, సమయం వంటి తదితర సమాచారం ఉంటుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు విడుదల చేయనున్నారు. ఇక నీట్ యూజీ 2025 పరీక్ష దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 4న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది.

కాగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. నీట్‌ యూజీ 2025 పరీక్ష తొలుత ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ఎన్టీయే భావించినప్పటికీ ఆ తర్వాత ఎప్పటి మాదిరిగానే ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని భావించింది. దీంతో పెన్ను, పేపర్‌ విధానంలో మే 4వ తేదీన దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. గతేడాది ఏకంగా 24 లక్షల మంది అభ్యర్ధులు ఈ పరీక్ష రాశారు. మొత్తం 180 నిమిషాలు అంటే 3 గంటల పాటు నీట్ రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష సిలబస్‌, పరీక్ష విధానం, పరీక్ష కేంద్రం తదితర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నీట్‌ యూజీ 2025 పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *