టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో డీజే టిల్లు సినిమా ఒకటి. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అదే రేంజ్ లో పాపులర్ అయ్యింది క్రేజీ బ్యూటీ నేహా శెట్టి.
తన అందంతో క్యూట్ నెస్ తో ప్రేక్షకులను అలరించింది ఈ భామ. పూరిజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా వచ్చిన మెహబూబా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది నేహా శెట్టి.
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన గల్లీ రౌడీ మూవీలో హీరోయిన్ గా చేసిన ఈ బ్యూటీ ఆ సినిమా తర్వాత అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో చిన్న పాత్రలో నటించింది. ఇక డీజే టిల్లు సినిమాతో ఈ బ్యూటీకి కావాల్సినంత క్రేజ్ వచ్చింది.
డీజే టిల్లు సినిమా తర్వాత ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసింది కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. డాన్ తో ఈ అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయి. ప్రస్తుతం నేహా శెట్టి స్పీడ్ తగ్గించింది. కాగా పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలో గ్లామర్ ఎటాక్ తో ఫాలోవర్స్ ని ఆకట్టుకుంటుంది నేహా శెట్టి. రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది.