Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!

Neptune Astrology: 14 ఏళ్లకి రాశి మారనున్న వరుణ గ్రహం.. వారికి ఆకస్మిక అదృష్టం..!


ఆధునిక భారతీయ జ్యోతిషశాస్త్రంలో వరుణ గ్రహానికి కూడా ప్రాధాన్యం ఉంది. నెప్ట్యూన్ పేరుతో ఇంతవరకూ పాశ్చాత్య దేశాలలో ప్రాముఖ్యం సంపాదించుకున్న ఈ గ్రహానికి ఇప్పుడు క్రమంగా ప్రాధాన్యం పెరుగుతోంది. మార్చి 20వ తేదీన వరుణ గ్రహం మేష రాశిలో ప్రవేశించి, అదే రాశిలో 14 సంవత్సరాలు కొనసాగబోతోంది. ఆకస్మిక పరిణామాలకు, కలలో కూడా ఊహించని అభివృద్ధికి కారకుడైన వరుణుడు మేష రాశి ప్రవేశంతో ఈ ఏడాది కొందరి జీవితాలు సమూలంగా మారిపోయే అవకాశం ఉంది. అకస్మాత్తుగా ధనవంతులు కావడానికి, ఊహించని విధంగా విదేశాలకు వెళ్లడానికి, అదృష్టాలు కలగడానికి వరుణుడు కారకుడు. మేషం, మిథునం, కర్కాటకం, సింహం, తుల, మకర రాశుల వారి జీవితాల్లో కొన్ని కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశిలో వరుణుడి సంచారం వల్ల అనుకోకుండా విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడం జరుగు తుంది. ఉద్యోగులకు విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. లాటరీలు, షేర్లు, వడ్డీ వ్యాపా రాలు, రియల్ ఎస్టేట్ వంటి వాటి ద్వారా సంపద వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం కూడా ఉంది.
  2. మిథునం: ఈ రాశికి లాభస్థానంలో వరుణుడి సంచారం వల్ల అనేక విధాలైన అదృష్టాలు కలుగుతాయి. టెక్నికల్, టెక్నలాజికల్, సైన్స్, మేథ్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి అనేక విధాలుగా రాబడి పెరగడంతో పాటు పదోన్నతులు కలుగుతాయి. ఆధునిక జీవనశైలి అలవడుతుంది. ఆదాయ అవకాశాలు బాగా వృద్ధి చెందుతాయి. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా విదేశాల్లో స్థిరపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో వరుణుడి సంచారం తప్పకుండా వృత్తి, ఉద్యోగాలలో అందలాలు ఎక్కి స్తుంది. ఉద్యోగపరంగా రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలతో పాటు విస్తృ తంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది. సామాజికంగా మంచి పరిచయాలు కలగడంతో పాటు ఊహించిన ప్రాధాన్యం లభిస్తుంది. కీర్తిప్రతిష్ఠలు బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలు దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో వరుణుడి సంచారం వల్ల తండ్రికి అదృష్టాలు కలగడంతో పాటు, తండ్రి నుంచి ఆస్తిపాస్తులు సంక్రమించే అవకాశం కూడా ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. లాటరీలు, షేర్లు, ఇతర వడ్డీ వ్యాపారాల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆధునిక జీవనశైలి అలవడుతుంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది.
  5. తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో వరుణుడి సంచారం వల్ల వృత్తి, వ్యాపారాలు విశేషంగా అభివృద్ధి చెందు తాయి. వీటికి విదేశాలతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు ఉన్నత విద్యకు విదే శాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ వ్యక్తితో గానీ, విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో గానీ పెళ్లి సంబంధం కుదురుతుంది. సాధారణ వ్యక్తులు సైతం సంపన్నులు కావడానికి అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. కుటుంబంలో శుభ పరిణామాలు సంభవిస్తాయి.
  6. మకరం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో వరుణుడి సంచారం వల్ల ఆస్తిపాస్తులకు సంబంధించిన సమస్యలు, వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. భూలాభాలు కలుగుతాయి. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. తల్లితో విభేదాలు తొలగిపోయి సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. తల్లి వైపు నుంచి చర, స్థిరాస్తులు లభించే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగడం వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *