Newborn: అయ్యో దేవుడా! వారం రోజుల పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Newborn: అయ్యో దేవుడా! వారం రోజుల పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?


లక్నో, నవంబర్‌ 3: కళ్లు కూడా తెరవని 7 రోజుల పసికందు పట్ల కన్నవాళ్లు అమానుషంగా ప్రవర్తించారు. ఓ వంతెన పై నిలబడి కిందకు అమాంతం విసిరేశారు. అయితే బిడ్డ నేరుగా కిందపడిపోకుండా ఓ చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. చెట్టుపై నుంచి బిడ్డ ఏడుపు విన్న స్థానికులు తీవ్ర గాయాలపాలైన శిశువును కాపాడారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో రెండు నెలల క్రితం అంటే ఆగస్ట్‌ 26న ఏడు రోజుల పురిటి బిడ్డను కన్నవాళ్లు వద్దనుకున్నారు. దీంతో ఒక వంతెన పైనుంచి కిందకు విసిరేశారు. అయితే అదృష్టవశాత్తు ఆ బిడ్డ ఓ చెట్టు కొమ్మలపై పడింది. అ క్రమంలో ఓ పక్ష బిడ్డపై దాడి చేసి, ముక్కుతో పొడవడంతో రక్తం ఓడుడూ.. ఆర్తనాదాలు చేసింది. పసి వాడి ఏడ్పు విన్న స్థానికులు ఆ బిడ్డను రక్షించారు. తొలుత హమీర్‌పూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాన్పూర్‌లోని లాలా లజపతిరాయ్ హాస్పిటల్‌కి తరలించారు. చెట్టు కొమ్మలపై కాకులు పొడిచి, కీటకాలు కుట్టడంతో పాటు నవజాత శిశువు శరీరమంతా 50కు పైగా గాయాలయ్యాయి. తొలుత పసికందు బతకడం చాలా కష్టమని భావించిన డాక్టర్లు.. చివరికి ఎలాగోలా బతికించగలిగారు.

Newborn Thrown Off Bridge By Parents

Newborn Thrown Off Bridge By Parents

ఆసుపత్రి సిబ్బంది ఎంతో శ్రద్ధగా పసికందుకు చికిత్స అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు చెట్టుపై దొరికిన ఆ పసికందుకు కృష్ణ అని పేరు పెట్టారు. రెండు నెలలపాటు కంటికి రెప్పలా కాపాడారు. గాయాల నొప్పితో ఆ బాబు ఏడ్చినప్పుడల్లా నర్సులు లాలిపాటలు పాడారు.. ఇలా అందరూ అమ్మలై ఆ పసి వాడిని కాపాడారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో అక్టోబర్‌ 24న శిశు సంక్షేమ కమిటీ సభ్యులకు పోలీసులు అప్పగించారు. ఈ సందర్భంగా డాక్టర్లు, నర్సులు ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. 2 నెలలపాటు ఎంతో అనుబంధం పెంచుకున్న ఆ బాల కృష్ణుడ్ని విడువలేక కన్నీరు కార్చినట్లు డాక్టర్ కళా తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *