ఓలా జెన్-3 స్కూటర్లు కేవలం రూ. 79,999 ధరతోనే కంపెనీ అందుబాటులో ఉంచింది. ఓలా కంపెనీ తమ వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ స్కూటర్ల విక్రయాలను ప్రారంభించింది. ఈ స్కూటర్ల డెలివరీలు వచ్చే 15 రోజుల్లో ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయని నిపుణులు అంచనా వేస్తుంది. ఓలా ఎస్1 జెన్-3 శ్రేణిలో ఇప్పుడు 2 కేడబ్ల్యూహెచ్, 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికల్లో, ఎస్1ఎక్స్ 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ఎస్1ఎక్స్+ 3 కేడబ్ల్యూహెచ్, 4 కేడబ్ల్యూహెచ్ ఎంపికలతో ఎస్1 ప్రో, కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్1 ప్రో+ 4 కేడబ్ల్యూహెచ్చ 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికలతో లాంచ్ చేయనున్నారు. ఓలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఎస్ ప్రో ప్లస్ 5.3 కేడబ్ల్యూహెచ్ ధర రూ.1,69,999గా ఉంది. అయితే కేవలం లాంచ్ ప్రైసెస్ అంటే ఈ ధరల్లో కేవలం ఏడు రోజుల్లో స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఓలా కంపెనీ ఈ ధరలను పెంచే అవకాశం ఉంటుంది.
జెన్-3 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో ఓలా జెన్-2 కంటే 15 శాతం ఎక్కువ శ్రేణిని క్లెయిమ్ చేస్తూ బోర్డు అంతటా బ్రేక్-బై-వైర్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది. ఇది పేటెంట్ పొందిన బ్రేక్ సెన్సార్‌ను ఉపయోగిస్తుంది. అలాగే సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో కలిపి ఓలా “డ్యూయల్ ఏబీఎస్” అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఓలా జెన్-3 వేరియంట్‌లో మిడ్-మౌంటెడ్ మోటార్ ఆకర్షిస్తుంది. అలాగే ఈ స్కూటర్ డ్రైవ్‌ట్రైన్ ఇప్పుడు బెల్ట్-డ్రైవ్ నుంచి చైన్-డ్రైవ్‌కు మార్చారు. అలాగే ఓలా మూవ్ ఓఎస్-5 వేదికపై డీఐవై మోడ్‌తో ప్రకటించారు. రోడ్‌ట్రిప్ మోడ్, భారత్ మూడ్ మరిన్నింటితో పాటు స్మార్ట్‌వాచ్ యాప్ ఇంటిగ్రేషన్ ఆకట్టుకుంటుంది.
ఓలా ఎస్1 ఎక్స్ జెన్-3తో కూడా ఓలా ఓలా 4.3 అంగుళాల పరిమాణంలో సెగ్మెంటెడ్ కలర్ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందిస్తోంది. ఓలా ఎస్1 ఎక్స్ జెన్-3 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్‌ని ఎంచుకుంటే ఒక సింగిల్ ఛార్జ్‌పై 242 కిమీ పరిధి, 7 కేడబ్ల్యూ పీక్ పవర్, 123 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ని అందిస్తుంది. ఎస్1ఎక్స్+తో గరిష్ట వేగం గంటకు 125 కి.మీలకు పెరుగుతుంది. ఎస్1 ప్రో జెన్-3 4 కేడబ్ల్యూహెచ్ ద్వారా కూడా 242 km పరిధి, 125 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఎస్1ఎక్స్+ మాదిరిగానే ఉంటాయి. ఈ స్కూటర్స్‌తో 7 అంగుళాల టచ్‌స్క్రీన్, వెనుక డిస్క్ బ్రేక్‌లు, సింగిల్-ఛానల్ ఏబీఎస్ ఆకట్టుకుంటాయి. అలాగే ఎస్ 1 ప్రో ప్లస్ డ్యూయల్-ఛానల్ ఏబీఎస్, 13 కేడబ్ల్యూ (17.43 బీహెచ్‌పీ) పీక్ పవర్, ఓలాకు సంబంధించిన దేశీయ 4680 సెల్‌లతో 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఎంపికతో వస్తుంది. ఈ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కిమీ. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 141 కిమీగా ఉంది. అలాగే 5.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 320 కిమీ శ్రేణి అందిస్తుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి