బ్రహ్మానందం తర్వాత తెలుగు ప్రేక్షకులను ఆ స్థాయిలో నవ్విస్తోన్న స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్. క్యారెక్టర్ ఏదైనా తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఈ నటుడి స్టైల్. తన క్రేజ్ కు తగ్గట్టుగానే స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూనే, సోలో హీరోగానూ ఆకట్టుకుంటున్నాడు వెన్నెల కిశోర్. అలా అతను టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయతగా పని చేసిన రైటర్ మోహన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ కు ముందే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ‘బుక్ మై షో’లో ఈమూవీకి 7.5 రేటింగ్ రావడం విశేషం. ఎప్పటిలాగే వెన్నెల కిశోర్ తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. డిటెక్టివ్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే తెలుగమ్మాయి అనన్య నాగళ్ల కూడా ఆకట్టుకుది. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ యాప్ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. శుక్రవారం (జనవరి 24) అర్ధ రాత్రి నుంచి వెన్నెల కిశోర్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చింది. థియేటర్లలో లాంగ్ రన్ కొనసాగించలేకపోయిన ఈ మూవీ నెలరోజుల్లోపే ఓటీటీలోకి రావడం గమనార్హం.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాలో వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల జోడీ హైలెట్ గా నిలిచింది. వీరితో పాటు రవితేజ మహాదాస్యం, ‘నేనింతే’ ఫేమ్ సియా గౌతమ్, కాలకేయ ప్రభాకర్, మురళీ ధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చిత్రాన్ని లాస్య రెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ పతాకం మీద వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ‘కమిటీ కుర్రోళ్లు’, ‘ఆయ్’, ‘క’ లాంటి విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు. మరి థియేటర్లలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ఇవి కూడా చదవండి
ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..
🔍 The mystery begins!
Watch the trailer of “Srikakulam Sherlock Holmes” now and get ready for an exciting ride. 🎬
Streaming on @ETVWin from Jan 24.#SrikakulamSherlockHolmes #ETVWin pic.twitter.com/3BrQKmzOaF— ETV Win (@etvwin) January 23, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.