OTT: యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT: యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?


OTT: యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్. విజయ్‌ కార్తికేయ తెరకెక్కించిన ఈ సినిమాలో హనుమాన్ ఫేమ్ వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్, శరత్‌ లోహితస్య, ఉగ్రం మంజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గత ఏడాది డిసెంబరు 27న కన్నడతో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి మ్యాక్స్ సినిమా రిలీజైంది. రెండు చోట్లా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కార్తీ ఖైదీ తరహాలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, ఆసక్తికరమైన కథా కథనాలు, సుదీప్‌ యాక్షన్‌ సీక్వెన్స్ ఆడియెన్స్ ను కట్టి పడేశాయి. పరిమిత బడ్జెట్ తో తెరకెక్కిన మ్యాక్స్ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మ్యాక్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 సొంతం చేసుకుంది. కొన్ని రోజుల క్రితమే మ్యాక్స్ సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందుకు తగ్గట్టుగానే శనివారం (ఫిబ్రవరి 16) రాత్రి 7.30 గంటల నుంచే మ్యాక్స్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సుదీప్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

కిచ్చా క్రియేషన్స్‌తో కలిసి వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌.థాను మ్యాక్స్ సినిమాను నిర్మించారు. ఉగ్రం మంజు, ఇళవరసు, సంయుక్త హోర్నార్డ్, సుధా బేల్ వాడి, వంశీ కృష్ణ, అడుకలం నరేన్, ప్రమోద్ శెట్టి, రెడిన్ కింగ్ స్లే తదితరులు ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కీలక పాత్రలు పోషించారు. విరూపాక్ష, మంగళవారం సినిమాలకు సంగీతం అందించిన అజనీష్ లోక్ నాథ్ మ్యాక్స్ సినిమాకు సంగీతం అందించాడు. మరి థియేటర్లలో మ్యాక్స్ సినిమాను మిస్ అయ్యారా? అలాగే యాక్షన్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ వీకెండ్ లో మ్యాక్స్ సినిమా మీకు మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

జీ5లో స్ట్రీమింగ్..

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *