
Tamil Nadu: తమిళనాడులో ప్రకంపనలు రేపుతోన్న అజిత్‌కుమార్ కస్టోడియల్ డెత్
తమిళనాడు మడపురంలో కొద్దిరోజుల క్రితం పోలీసుల చిత్రహింసలతో అజిత్‌కుమార్ అనే ఓ వ్యక్తి మరణించారు. సంచలనం రేపిన ఈ కేసుతో గతంలో జరిగిన లాకప్‌డెత్‌లు తెరపైకి రావడం తమిళ్ పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. ప్రధానంగా.. నటుడు విజయ్ సారథ్యంలోని తమిళగ వెంట్రి కళగం పార్టీ.. లాకప్ డెత్‌లపై పోరు సాగిస్తోంది. అజిత్‌కుమార్ లాకప్‌డెత్ నేపథ్యంలో పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారి టీవీకే అధినేత విజయ్ రోడ్డె్క్కారు. చెన్నైలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. గతంలో పోలీసు కస్టడీల్లో…