
Andhra Pradesh: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు భారీ ప్రమాదం..! రెండు ముక్కలుగా విడిపోయిన భోగీలు..
శ్రీకాకుళం జిల్లా పలాసలో రైలు ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. సికింద్రాబాద్ నుంచి హావ్‌డా వైపు వెళ్తుండగా పలాస పట్టణ శివారులో ఘటన జరిగింది. ఇవాళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనలో…