
AP News: ఆస్పత్రిలో వాచ్‌మెన్ వైద్యం.. ఐదుగురు స్టాఫ్ సస్పెండ్
నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు విధులకు హాజరుకాకపోవడంతో వాచ్‌మెన్ డాక్టర్ అవతారమెత్తాడు. గత కొన్నిరోజులుగా వాచ్‌మెన్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాడు. గర్భిణీలకు కూడా వైద్యం చేస్తున్నాడు. దీంతో ఆ ఆస్పత్రి వైపు వెళ్లాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. కొత్తబురుజు ఆస్పత్రిలో నెలకొన్న పరిస్థితులపై టీవీ9 వరుస కథనాలను ప్రసారం చేసింది. వాచ్‌మెన్ ట్రీట్‌మెంట్ ఇస్తోన్న విజువల్స్‌ను బయటపెట్టింది. టీవీ9 కథనాలపై నంద్యాల కలెక్టర్ రాజకుమారి స్పందించారు. కొత్తబురుజు…