
నారీ నారీ నడుమ మురారీ.. ఒకే వేదికపై ఇద్దరిని మనువాడిన యువకుడు.. ఎక్కడో తెలుసా!
ఒకే పెళ్లి మండపంలో ఇద్దరు అమ్మాయిల మెడలో తాళి కట్టి వార్తల్లో కెక్కిన కొమురంభీం జిల్లా కు చెందిన సూర్యదేవ్ వార్త గుర్తుంది కదా.. అంతా ఈజీగా ఎలా మర్చిపోతామంటారా.. సేమ్ టూ సేమ్ సూర్యదేవ్ స్టైల్ లోనే ఇద్దరు యువతులను ప్రేమించి పెద్దలను ఒప్పించి.. ఒకే పెళ్లి మండపంలో ఇద్దరి మెడలో ఆరుముళ్లేసి భళా అనిపించుకున్నాడు మరో యువకుడు. ఇళ్లంతా పందిరేసి వేలాది మంది బందువులను ఆహ్వానించి బాండ్ రాసిచ్చి మరీ ఇద్దరు యువతులను మనువాడాడు…