
Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..
పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత 18 నెలల్లో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ అలియాస్ సోధి (33)గా పోలీసులు గుర్తించారు. స్వలింగ సంపర్కుడైన నిందితుడు.. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 11 మంది పురుషులను హతమార్చినట్లు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత…