
రూటు మార్చిన దొంగలు.. సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులే షాక్..!
దొంగలు రూటు మార్చారు. నేరాలకు పాల్పడేందుకు కొత్త పద్ధతిని అవలంభిస్తున్నారు. ఇప్పుడు దొంగలు సూట్లు, బూట్లు, టైలు వేసుకుని దర్జాగా వచ్చి పట్టపగలు చోరీలకు పాల్పడుతూ పారిపోతున్నారు. తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీ వీవీఐపీ ఏరియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. గోండా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకే రోడ్‌లోని ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడి రూ.30 లక్షల నగదు, నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్…