
Telangana: వామ్మో.! వీళ్లు మామూలోళ్లు కాదు.. స్కెచ్ వేస్తే ఆనవాళ్లు కూడా దొరకవ్..
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తరచూ దొంగతనాలు జరగడం పోలీసులకు తలనొప్పిగా మారింది. తాళం వేసిన ఇళ్లను గుళ్ల చేస్తున్న దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఒక దొంగతనం మరవకముందే మరో దొంగతనం జరగడంతో పోలీసులు నెత్తి పట్టుకుంటున్నారు. కోటర్మూర్‌కు చెంది సయ్యద్ మొయినోద్దీన్ ఇంట్లో తాళం పగులగొట్టి దొంగతనం జరిగి ఒక్కరోజు గడవకముందే ఎస్టిఓగా విధులు నిర్వహిస్తున్న తాజుద్దీన్ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు దొంగలు. సుమారు లక్ష రూపాయల నగదు,…