
TGPSC Junior Lecturer Posts: జేఎల్ పోస్టులకు 10-15 రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలన.. త్వరలోనే పోస్టింగ్‌లు
హైదరాబాద్, జనవరి 2: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కాలేజీల రూపురేఖలు మారనుంది. తొలిసారిగా సర్కారు కాలేజీలలో 1,239 మంది శాశ్వత అధ్యాపకులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు జూనియర్ లెక్చరర్ల ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్‌సీ) ఇంటర్ విద్యాశాఖకు అందజేసింది. వాస్తవంగా 1,392 మంది నియామకాలకు 2022 డిసెంబరులో టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్ జారీ చేయగా.. పలు కారణాల రిత్య అప్పటి నుంచి జాప్యం జరుగుతూ వచ్చింది. ఆంగ్లం సబ్జెక్టుపై వ్యాజ్యం…