
పహల్గామ్ మిగిల్చిన విషాదం.. కన్నీరు పెట్టిస్తున్న తండ్రిని కోల్పోయిన ఓ కొడుకు మాటలు..!
మంగళవారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు భూతల స్వర్గాన్ని నరకంగా మార్చారు. అడవులు, పర్వతాలతో చుట్టుముట్టిన ఈ పెద్ద గడ్డి మైదానంలో ఉగ్రవాదులు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాల్పులు ప్రారంభమైన వెంటనే స్థానికులు భద్రత కోసం పారిపోయారు. పర్యాటకులు నిస్సహాయంగా మిగిలిపోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఈ దాడి చాలా మంది కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పిల్లవాడి వీడియో బయటపడింది. అందులో తండ్రి కోల్పోయినర ఒక కొడుకు…