
Calculator to Exams: ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. ఆ పరీక్షకు కాలిక్యులేటర్ అనుమతి!
న్యూఢిల్లీ, మార్చి 26: బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు సీబీఎస్సీ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. అకౌంట్స్ పరీక్షలో వచ్చే సుదీర్ఘ గణనల నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష రోజున కాలిక్యులేటర్లు వినియోగానికి అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనను సీబీఎస్‌ఈ పరిశీలిస్తుంది. ప్రతిపాదనలకు అనుమతి లభిస్తే నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ప్రతిపాదనపై మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు….