
Lord Shiva Puja: శివయ్య అనుగ్రహం కోసం సోమవారం దీపం వెలిగించడం శుభప్రదం.. ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎటువంటి ఫలితాలంటే..
శివుడిని భోలాశంకరుడు అని అంటారు. నిర్మలమైన మనసుతో శివ శివ అంటూ జలంతో అభిషేకం చేసినా భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. అందుకనే దేవాది దేవుడైన మహాదేవుడిని పూజించడానికి వారంలో సోమవారం అంకితం చేశారు. శివయ్య అనుగ్రహం సోమవారం నాడు ఏ నూనెతో దీపం వెలిగించాలో తెలుసుకుందాం. సోమవారం మహాదేవుడికి అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో సోమవారం రోజున శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆవ నూనె, నెయ్యి లేదా మహువా నూనె((ఇప్ప పూల)తో…