
AP SSC 2025 Exam Fee: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపులు నేటి నుంచి ప్రారంభం.. చివరి తేదీ ఇదే
అమరావతి, అక్టోబర్ 28: రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి చదువుతున్న విద్యార్ధులు రానున్న పబ్లిక్ పరీక్షల కోసం ఫీజు చెల్లింపులు సోమవారం (అక్టోబర్ 28) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పరీక్ష ఫీజుల చెల్లింపులు నవంబరు 11వ తేదీలోపు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా చెల్లించాలని డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఈలోపు కట్టలేకపోతే ఆలస్య రుసుముతో చెల్లించేందుకు వెసులుబాటు ఉంటుంది. రూ.50 ఆలస్య…