
Telangana: వచ్చే నెల రోజుల్లో గ్రూప్ 2, 3 నియామకాలు పూర్తి చేస్తాం.. సీఎం రేవంత్
హైదరాబాద్, మార్చి 21: తెలంగాణ నిరుద్యోగులకు పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే ఫలితాలు ఇచ్చామ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వచ్చే 30, 40 రోజుల్లో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని, ఉద్యోగాలు ఇచ్చినా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని గురువారం (మార్చి 20) హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ‘ప్రజాపాలనలో కొలువుల పండగ’ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన ‘బిల్డ్ నౌ పోర్టల్’ను ప్రారంభించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య…