
IND vs ENG: వాంఖడేలో అభిషేక్ శర్మ విధ్వంసం.. 37 బంతుల్లోనే మెరుపు సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే?
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టీ20 మ్యాచ్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. సంజూతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన అభిషేక్ తొలి బంతి నుంచే అద్భుతంగా ఆడి కేవలం 37 బంతుల్లోనే మెరుపు సెంచరీని నమోదు చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు….