
తండ్రిని చంపేసి.. సెకండ్ షో సినిమాకు వెళ్లిన కూతురు! ఆ తర్వాత జరిగిందిదే..
ఘట్‌కేసర్, జులై 10: ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ చెరువులో జులై 7న ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మృతుడి ఒంటిపై గాయాలుండటంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో మృతుడు హైదరాబాద్ కవాడిగూడ ముగ్గుల బస్తీకి చెందిన వడ్లూరి లింగం (45)గా గుర్తించారు. లింగం ఇంటికి వెళ్లగా.. అతడి భార్య శారద (40) కుమార్తె మనీషా (25)…