
Samantha: ‘శుభం’పై నాకు ఎంతో నమ్మకం ఉంది.. సినిమా చాలా బాగా వచ్చింది: సమంత
ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. సమంత మాట్లాడుతూ.. నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది…