
Betting Suicide: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య… మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
ఈజీమనీ వేటలో కొంతమంది ఆన్‌లైన్ గేమింగ్‌కి, బెట్టింగ్‌కి అడిక్ట్ అవుతున్నారు. లక్కు కలిసి వస్తుందనే ఆశతో లక్షల రూపాయలు బెట్టింగ్‌లకు తగలేస్తున్నారు. లక్కీ భాస్కర్ మాటదేవుడెరుగు.. అప్పుల్లోంచి కోలుకునే మార్గం కనబడక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ బేగంపేట్ లో ఓ సాఫ్ట్వేర్ సంస్థ లో…