
చంటిపాపను చంకనెత్తుకొని విధుల్లో పోలీస్..వీడియో
ఫిబ్రవరి 15వ తేదీన ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యవాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వే అధికారులు స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇలాంటి సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తించారు. ఓవైపు తన బిడ్డ సంరక్షణతోపాటు.. మరోవైపు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకున్నారు. ఒక వ్యక్తి పట్టాలపై ఉన్న రైలుకు ఆనుకొని చల్లటి పానియం తాగుతుండగా ఆమె అతనిని హెచ్చరించి, పక్కకు రమ్మని…