
Khammam District: ఆశ్చర్యం.. అనారోగ్యంతో 10 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి వెళ్లిన ఆంబోతు
సాధారణంగా మనుషులు అనారోగ్యం పాలైతే హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ డాక్టర్లు సూచించినదాని ప్రకారం.. టెస్టులు చేయించుకుని మాత్రలు తీసుకుని వస్తారు. ఒకవేళ వెళ్లడం చేతగాకపోతే కుటుంబ సభ్యుల్ని ఎవర్నైనా తోడు తీసుకెళ్తారు. ఎలాంటి మాటలు మాట్లాడలేని.. ఒక మూగ జీవి అనారోగ్యం పాలైంది నడవలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న ఆ ఆంబోతు..ఆసుపత్రికి నడిచి వెళ్లింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామస్థులు రెండు ఆంబోతులను పెంచుతున్నారు.. వాటి సంరక్షణ గ్రామస్థులు చూస్తున్నారు.. వాటిలో ఒక 14…