
Wankhede Stadium: హాఫ్ సెంచరీ చేసుకున్న ప్రతిష్టాత్మక స్టేడియం!
ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిర్వహణలో ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలు క్రికెట్ ప్రేమికులకు మరపురాని స్మృతులను అందించాయి. జనవరి 19న జరిగే ఈ ప్రత్యేక వేడుకల్లో గ్రౌండ్‌స్టాఫ్, క్రికెట్ లెజెండ్స్, అభిమానులను గౌరవించే అనేక కార్యక్రమాలు జరిగాయి. ఎంసీఏ తన 178 మంది గ్రౌండ్‌స్టాఫ్‌కు జంబో గిఫ్ట్ హ్యాంపర్లను అందజేసింది. ఈ హ్యాంపర్లలో 5 కేజీల బియ్యం, గోధుమలు, పప్పు, మిక్సర్ గ్రైండర్, హైడ్రేషన్ కిట్లు,…