
Cyclone Fengal: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ విధ్వంసం.. విద్యాసంస్థలకు సెలవులు
తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ తుఫాన్ బీభత్సం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. తిరువణ్ణామలై .విలుపురం . కళ్లకురిచ్చి జిల్లాలకు రెడ్ అలర్ట్ చేశారు. ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరో ఐదు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. విల్లుపురంలో వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. రిలీఫ్ క్యాంప్‌ల్లో వరదబాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు…