
CM Revanth Reddy: హాస్టళ్లలో ఫుడ్‌పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకే హాస్టల్‌లో రెండు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాల్లలో విద్యార్థులను కన్న బిడ్డల్లా…