
నా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు.. 44 ఏళ్ల క్రితం నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నః రంగనాథ్
తన ఇంటి విషయంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ మధురానగర్‌లో తన ఇల్లు బఫర్ జోన్‌లో ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తన ఇల్లు విషయంపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు రంగనాథ్. 44 ఏళ్ల క్రితం వారి నాన్న నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నట్లు వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణకాంత్ పార్కు దిగువున వున్న…