
News9 Global Summit: ‘భారత్-జర్మన్ సంబంధాల్లో నేడు సరికొత్త అధ్యాయం మొదలైంది’.. ప్రధాని మోదీ
టీవీ9 నెట్‌వర్క్ జర్మనీలో నిర్వహిస్తున్న న్యూస్9 గ్లోబల్ సమిట్‌లో ప్రధాని మోదీ శుక్రవారం ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇండో-జర్మన్ సంబంధాల్లో నేడు కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం టీవీ9 చేపట్టినందుకు మోదీ అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమని పేర్కొన్నారు. మోదీ ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘జర్మనీ, జర్మన్ ప్రజలను కనెక్ట్ చేయడానికి భారతీయ మీడియా గ్రూప్ పని చేస్తున్నందుకు నేను…