
ప్రజలే కాదు.. మూగజీవులను రక్షిస్తాం.. పోలీసులు చేసిన పనికి హ్యాట్సాఫ్!
ఖాకీలంటేనే కఠినాత్ములు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. జనాలకు రక్షణగా శాంతిభద్రతల పరిరక్షణకు.. నేరస్తుల పట్ల కఠినంగా ఉండే పోలీసులను చూస్తుంటాం. అయితే మనుషుల పట్లనే కాదు.. మూగ జీవాలను సంరక్షించి తమలో కూడా మానవత్వం ఉందని నిరూపించారు నల్లగొండ పోలీసులు. నల్గొండలోని బొట్టుగూడ ప్రాంతంలో విఠల్ హాస్పిటల్ పక్కన పాత బావి ఉంది. వీధుల్లో తిరిగే ఆవు మేత కోసం వెళ్ళి ప్రమాదవశాత్తూ బావిలో జారి పడింది. పది అడుగుల లోతు కలిగిన పాత బావిలో…