
Gautam Adani: భారీ నష్టాల్లో ఆదానీ షేర్లు.. నిమిషాల్లోనే రూ.2.24 లక్షల కోట్లు నష్టం
అమెరికాలో గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు రావడంతో గురువారం భారత స్టాక్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. అదానీ గ్రూప్ షేర్లలో 10 నుంచి 20 శాతం క్షీణత కనిపించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 15 శాతం పడిపోయాయి. అదానీ పోర్ట్, సెజ్, అదానీ పవర్ అండ్ ఎనర్జీ మరియు గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్‌లలో పెద్ద క్షీణత కనిపించింది. దీని కారణంగా కొన్ని నిమిషాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.2.24 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది….