
Amla Pieces : ఆరోగ్యానికి మేలు చేసే ఎండు ఉసిరి.. రోజూ 2ముక్కలు తినండి చాలు..!
ఉసిరిలో ఉండే విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ శోషణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి, కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. ఉసిరిలోని టానిన్లు రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలు. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. ఎండు ఉసిరిలోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పోషకాల గని అంటారు….