
Watch: దారుణం.. వాకిట్లో ముగ్గు వేస్తున్న ఇద్దరు బాలికలపైకి దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదుపుతప్పి వేగంగా వచ్చిన ఓ కారు ఇద్దరు బాలికలను ఢీకొట్టింది. పండుగ సందర్భంగా ఇద్దరు బాలికలు ఇంటి బయట రంగోలీలు వేస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ వాహనం అదుపుతప్పి వారిద్దరినీ దారుణంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ కారు దిగి పరారయ్యాడు. చివరికి పోలీసులు అతడిని పట్టుకోగా అతడు మైనర్ అని తేలింది. కాగా, బాలికలిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న…