
HCA Scam: సీఐడీ కస్టడీకి హెచ్‌సీఏ నిందితులు… ఇవాళ్టి నుంచి ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.హెచ్‌సీఏ కేసులో ఐదుగురు నిందితులను ఇవాళ కస్టడీకి తీసుకోనుంది సీఐడీ. నిందితులను ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించడంతో చర్లపల్లి జైలు నుంచి అదుపులోకి తీసుకోనున్నారు. హెచ్‌సీఏ క్లబ్స్‌లో అవకతవకలు, గత హెచ్‌సీఏ ఎన్నికల్లో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రధానంగా ప్రశ్నించనుంది సీఐడీ. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు, హెచ్‌సీఏ సీఈవో సునీల్, హెచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ సెక్రటరీ రాజేందర్‌యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్…