
పక్షి గూడు కడితే ఇంట్లో శుభమా.. అశుభమా..? ఆసక్తికర విషయాలు మీకోసం..!
పక్షి ఇంట్లో గూడు కట్టడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే శగుణ శాస్త్రం ప్రకారం ఇది శుభప్రదమైన సంకేతం. పక్షి గూడు వేసిన ఇంట్లో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుందని నమ్మకం. పక్షులు తమ గూడు కోసం ఎంచుకునే స్థలం సురక్షితంగా, శుభశక్తులతో నిండినదిగా ఉంటుందని విశ్వసించబడుతుంది. అందువల్ల, ఇల్లు పక్షులకు ఆశ్రయం కలిగించే స్థలంగా మారినప్పుడు.. అక్కడ సానుకూల శక్తులు ఉండే సూచనగా భావిస్తారు. ఇంట్లో పక్షి గుడ్లు పెడితే అదృష్టం కలుగుతుందని…