
గత పదేళ్లలో భారత్ గ్రాడ్యుయేట్ల ఉపాధి 55% పెరిగింది.. కేంద్ర మంత్రి మాండవీయ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశంలో గ్రాడ్యుయేట్లకు ఉపాధి సామర్థ్యం గణనీయంగా పెరిగిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 2013లో 33.95 శాతం ఉండగా 2024లో అది 54.81 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వల్ల ఉపాధి సామర్థ్యం మెరుగుపడిందని ఆయన అన్నారు. శనివారం గాంధీనగర్‌లో బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (బిమ్‌స్టెక్)…