
Income tax: వార్షికాదాయం రూ.12 లక్షలు దాటిందా..? ఈ టిప్స్ పాటిస్తే నో ట్యాక్స్
కేంద్రప్రభుత్వం 2025-26 యూనియన్ బడ్జెట్ లో రూ.12 లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇతర ఆదాయపు పన్ను నిబంధనలు సరిగ్గా వినియోగించుకుంటే రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వారు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఏడాదికి రూ.14.65 లక్షల కాస్ట్ టు కాస్ట్ కంపెనీ (సీటీసీ) సంపాదిస్తుంటే, ఎన్పీఎస్, ఈపీఎఫ్ చందాలు కడుతూ ఉంటే ఈ అవకాశం ఉంటుంది. కొత్త…