Gold Price Today: మహిళలకు దడ పుట్టిస్తున్న బంగారం ధర.. రూ. లక్ష దాటేసిన వెండి!
దేశంలో బంగారంలో పెరుగుదల కనిపించింది. బడ్జెట్ ప్రవేశానికి రెండు, మూడు రోజుల నుంచే పెరుగుతూనే ఉంది. గత బడ్జెట్‌లో ప్రభుత్వం తగ్గించిన దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం బడ్జెట్‌లో పెంచవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బంగారం ధర భారీగా పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. బంగారం మార్కెట్ పెరుగుతూనే ఉంది. తాజాగా జనవరి 30వ తేదీన బంగారంపై స్వల్పంగానే పెరిగినా మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.83,180…