
ఆడపిల్లలు కాదు.. ఆడ పులులు.. తెలంగాణలో మొదటి శివంగి టీమ్..!
నిర్మల్ జిల్లా పోలీసు వ్యవస్థలో మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకతతో “టీం శివంగి” అనే పేరుతో ఒక మహిళా కమాండో స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలనే ధ్యేయంతో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ టీమ్‌ను మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,…