
Caste Census: మోదీ ప్రభుత్వ నిర్ణయం నూతన శకానికి నాంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ట్వీట్..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. కులగణనకు రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ CCPA ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణను చేయాలని నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమానత్వం, సామరస్యం, సుపరిపాలన, సామాజిక న్యాయం.. నూతన శకానికి నాంది అంటూ ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్…