
దొంగ దెబ్బ తీస్తోన్న పాకిస్థాన్.. సాధారణ పౌరులే లక్ష్యంగా పాక్ సైనికుల కాల్పులు!
పహల్గామ్ దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్‌తో గట్టిగా బదులిచ్చింది భారత్. మన భద్రతా బలగాల యాక్షన్‌తో.. కడుపుమంటతో రగిలిపోతున్న పాక్ ఆర్మీ సరిహద్దు ప్రాంతాల ప్రజలపై ప్రతాపం చూపిస్తోంది. పదే పదే కాల్పులకి తెగబడుతోంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సేఫ్ జోన్‌లకు వెళ్లిపోతున్నారు సరిహద్దు గ్రామాల ప్రజలు. ప్రాణ భయంతో జమ్మూకశ్మీర్ సరిహద్దు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి బోర్డర్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాక్ సైన్యం.. గ్యాప్…