
Andhra News: తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి.. వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానియులు అందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వాళ్లను రాష్ట్రం నుంచి పంపేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం…