
Anantapur: రాత్రి హాస్టల్ గదుల్లో నిద్రపోయిన విద్యార్థినులు.. పొద్దున లేచేసరికి కాళ్లు, చేతులకు…
అనంతపురం నగరంలోని కె.ఎస్.ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లో ఒకే రోజు పదిమంది విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. హాస్టల్ రూమ్‌లో రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయని కళాశాల హాస్టల్ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా పదిమంది విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కొరికి గాయపరిచాయి. ఈ సంఘటన బయటకు పొక్కకుండా కళాశాల ప్రిన్సిపల్ సత్యవతి అత్యంత గోప్యంగా విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి టీకాలు వేయించారు. హాస్టల్ పరిసరాల్లో అపరిశుభ్ర…