
Hyderabad: క్రికెట్ బంతి పడిందని పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన బాలుడు – కనిపించింది చూసి షాక్
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఏడేళ్లుగా ఖాళీగా ఉన్న ఓ ఇంట్లో మానవ అస్తిపంజరం బయటపడటం కలకలం రేపుతోంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం… ఆ ఇంట్లో ఏడేళ్లుగా ఎవరూ నివసించడం లేదు. ఇంటి యజమాని విదేశాల్లో ఉంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇటీవల స్థానిక బాలురు క్రికెట్ ఆడుతుండగా.. బంతి ఆ ఇంట్లో పడటంతో తీసుకునేందుకు వెళ్లారు. తలుపులు తీయగానే ఒక మానవ అస్తిపంజరం కనిపించడంతో…