
Yoga Benefits: ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, నిద్ర లేమి సమస్య నివారణకు యోగా బెస్ట్.. ఈ ఆసనాలు ట్రై చేయండి..
ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. వయసుతో సంబంధం లేదు బిజీబిజీ లైఫ్ .. శారీరక శ్రమ కు దూరంగా ఒత్తిడికి దగ్గరగా జీవిస్తున్నారు. ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు కూడా.. చాలా సార్లు పని లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమస్యలు మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అప్పుడు త్వరగా అలసిపోతారు. శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. అయితే కొంత మందికి విశ్రాంతి తీసుకునే సమయం దొరకదు….