
Sharad Pawar: సమయం ఆసన్నమైంది.. ఇకనైనా రిటైర్మెంట్ తీసుకుంటారా?
ఏ ఒక్కరూ ఊహించని రీతిలో వచ్చిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొన్ని రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేశాయి. అందులో ముఖ్యంగా ఘోర పరాజయం మూటగట్టుకున్న మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి పార్టీల్లో రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ సారథ్యంలోని ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ’ (NCP) మనుగడ కొనసాగించేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే)తో కలిసి పొత్తుల్లో భాగంగా 86 స్థానాల్లో పోటీచేసిన శరద్…